ETV Bharat / bharat

2000 Kms of Yuvagalam Padayatra: యువగళం@2000 Kms.. ట్రెండింగ్​లో లోకేశ్​ పాదయాత్ర - యువగళం పాదయాత్ర

Yuvagalam Padayatra @ 2000 Kms: 5కోట్ల ఆంధ్రులకు.. వైఎస్సార్​సీపీ పాలన నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. నేటితో 2000వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

2000 Kms of Yuvagalam Padayatra
2000 Kms of Yuvagalam Padayatra
author img

By

Published : Jul 11, 2023, 11:46 AM IST

Yuvagalam Padayatra @ 2000 Kms: తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం.. వైఎస్సార్​సీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల అడ్డంకులు, పోలీసులు ఆంక్షలు, వాగ్వాదాలు, అడ్డగింతలు.. అన్నింటిని దాటుకుని ముందుకు సాగుతున్న యువనేత.. నేడు మరోమైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదటి అడుగు వేసిన లోకేశ్​.. రాయలసీమ జిల్లాలను కవర్​ చేసుకుని నెల్లూరు జిల్లాలో 2000 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు.

నిర్దేశించుకున్న లక్ష్యంలో 50 శాతం పూర్తి చేసి.. మిగిలిన దాని కోసం వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇప్పటికే సుమారు 30లక్షల మందిని నేరుగా కలుసుకున్న లోకేశ్​.. అందరి సమస్యలను విని.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే పాదయాత్రలో ప్రతీ 100 కిలోమీటర్లకు ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వస్తున్న యువనేత.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని నెెరవేరుస్తామంటూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా యువగళం పాదయాత్ర 2000కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ట్విట్టర్​లో ట్రెండింగ్​లో ఉంది.

Yuva Galam Padayatra Twitter Trending: ట్విట్టర్​లో దేశవ్యాప్తంగా #2000kmsOfYuvaGalam అనే యాష్ టాగ్ 4వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ట్విట్టర్ వేదికగా #2000kmsOfYuvaGalam అనే యాష్ టాగ్​తో వేల సంఖ్యలో టీడీపీ అభిమానులు, ఏపీ ప్రజలు ట్వీట్స్ చేస్తూ.. పాదయాత్రకి తమ సంఘీభావం తెలుపుతున్నారు.

Yuvagalam Padayatra
ట్విట్టర్​ ట్రెండింగ్​లో లోకేశ్​ పాదయాత్ర

Chandrababu Wishes to Lokesh on Yuavagalam 2000 Kms: రాష్ట్రంలో యువతకు, ప్రజల ఆందోళనలకు లోకేశ్​ అండగా ఉండడం చూసి గర్వపడుతున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు తెలిపారు. యువతే మన భవిష్యత్తు అని.. అభివృద్ధికి మంచి అవకాశాలను కల్పించడం ద్వారా టీడీపీ వారి అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తుందన్నారు. లోకేశ్​ మిగిలిన ప్రయాణంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

  • Congratulations on completing 2000Kms! I'm proud to see you championing the youth and lending an ear to the concerns of the people of our state. Youth are our future, and the TDP shall realise their immense potential by providing them with better opportunities for growth. Good… https://t.co/b3oKMXDO93 pic.twitter.com/DjTHUolp8K

    — N Chandrababu Naidu (@ncbn) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Lokesh on Yuvagalam: యువగళం పాదయాత్ర ఈ రోజు 2000 కిలోమీటర్ల పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని నారా లోకేశ్​ తెలిపారు. ఇది దూరం మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణమని అభివర్ణించారు. తనతో పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. మరో మైలురాయికి చేరుకుందామన్నారు. అందరం కలిసి మన రాష్ట్రాన్ని పునఃనిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

  • I complete 2000 Kms of #YuvaGalamPadayatra today. More than just the distance covered, this is a journey that embodies the dreams and aspirations of the youth of Andhra Pradesh. Thank you to all who've joined me, together we'll rebuild our state. Onward to the next milestone!… pic.twitter.com/VDsjwYZwmy

    — Lokesh Nara (@naralokesh) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TDP Leaders Sanghibhava Yatra: లోకేశ్‌ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు నేడు సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించనున్నారు. గుంటూరులో.. తెలుగు యువత ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. తాడేపల్లిలోని మహానాడు కట్ట నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ హామీలను వివరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.