ETV Bharat / bharat

రెండేళ్ల పగ.. మహిళపై హత్యాచారం.. 16 ఏళ్ల బాలుడి కిరాతకం - పోలీస్​ చెవి కొరికిన నిందితుడు కేరళ

ఇంట్లో ఒంటరిగా ఉన్న 58 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు 16 ఏళ్ల బాలుడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. బాధితురాలిని తీవ్రంగా కొట్టి ఆఖరికి హతమార్చాడు. ఈ ఘోరం మధ్యప్రదేశ్​లో జరిగింది. రెండేళ్ల క్రితం తనపై మొబైల్​ ఫోన్​ దొంగతనం నేరం మోపారనే కోపంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన యువకుడి పెదవిని కొరికేసింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

A Boy Raped Woman
A Boy Raped Woman
author img

By

Published : Feb 5, 2023, 6:47 PM IST

Updated : Feb 5, 2023, 6:57 PM IST

అమ్మమ్మ వయసు ఉన్న 58 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 16 ఏళ్ల బాలుడు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. రెండేళ్ల క్రితం బాధితురాలు తన ఇంట్లో మొబైల్​ ఫోన్​ దొంగిలించాడనే నేరం మోపినందుకే నిందితుడు పగతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెపిపారు.

పోలీసుల వివరాల ప్రకారం..
కైలాశ్​పురి గ్రామం హనుమాన పోలీస్​ స్టేషన్​ పరిధిలో జనవరి 30న అర్ధరాత్రి జరిగింది. రెండేళ్ల క్రితం బాధితురాలు నివాసం ఉంటున్న వీధిలోనే నిందితుడు ఉండేవాడు. వారి ఇంటికి టీవీ చూడటానికి బాలుడు తరచుగా వెళ్లేవాడు. ఈ క్రమంలో నిందితుడు తమ ఇంట్లోని ఫోన్​ను​ దొంగలించి బాధితురాలి కుటుంబం ఆరోపించింది. దొంగతనం ఆరోపణతో గ్రామంలో తన పరువు పోయిందని భావించిన బాలుడు ఆ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.

అదును కోసం వేచి చూసిన నిందితుడి బాధితురాలి ఇంట్లో ఆమె భర్త, కుమారుడు లేని సమయంలో ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటిస్తూ కేకలు వేసింది. అప్పడు ఆమె నోట్లో ఓ వస్త్రాన్ని ఉంచి ప్లాస్టిక్ కవర్​, తాడు సాయంతో ఆ మహిల ముఖాన్ని కట్టేసి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఈడ్చుకుంటూ వెళ్లాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కొడవలితో మహిళ తల, ఇతర శరీర అవయవాలపై దాడి చేశాడు. కర్రతో ఆమె ప్రైవేటు భాగాలనూ గాయపరిచాడు. అనంతరం మహిళ ఇంట్లో ఉన్న రూ.1000 నగదులో పాటు నగలను అపహరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జువైనల్​ హోంకు తరలించామని పోలీసులు తెలిపారు.

తెగిపోయేలా పెదవిని కొరికింది.. రక్షించుకుంది..!
ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్ జిల్లాలో ఓ మహిళ ధైర్యాన్ని ప్రదర్శించి తనను తాను రక్షించుకుంది. తనపై అత్యాచారం చేసేందుకు వచ్చిన వ్యక్తి పెదవులను తెగిపోయేలా కొరికి ఆత్మరక్షణ చేసుకుంది. దీంతో యువకుడి నోటి నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి నొప్పితో ఏడవడం మొదలుపెట్టాడు. ఇది విన్న స్థానికులు వెంటనే అక్కడ గుమిగూడి యువకుడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలు శనివారం మధ్యాహ్నం తన పొలంలో పని చేసుకుంటుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తనపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ సమయంలో తనను రక్షించుకునే క్రమంలో యువకుడి పెదవులను మహిళ కొరకడం వల్ల ఓ పెదవి భాగం ఊడిపోయి నేలపై పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి పెదవిని ఒక ప్యాకెట్‌లో సీల్ చేసి తీసుకెళ్లారు. నిందితుడిని పోలీసులు దౌరాలా సీహెచ్‌సీలకు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు.

మద్యం మత్తులో పోలీసు చెవి కొరికిన నిందితుడు..
కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఓ సబ్​ ఇన్​స్పెక్టర్ చెవిని కొరికి గాయపరిచాడు ఓ వ్యక్తి. గురువారం సాయంత్రం బైక్​ ప్రమాదం విషయంలో గొడవ పడి అరెస్టయిన నిందితుడు స్టెనీ రోడ్రిగ్జ్​ని స్థానిక పోలీస్ స్టేషన్​కి తీసుకువెళ్తున్న సమయంలో ఈ దాడి చేశాడు. జీపులోని ముందు సీటులో కూర్చున్న ఎస్​ఐ విష్ణుప్రసాద్ కుడి చెవిని తాగిన మత్తులో కొరికాడు స్టెనీ. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన పోలీసు అధికారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్​కు తరలించారు.

Last Updated : Feb 5, 2023, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.