Tourists rescued in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్ మండీలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన పర్యటకులను అధికారులు రక్షించారు. పరాషార్ ప్రాంతంలో.. స్థానికుల సహాయంతో ఆపరేషన్ చేపట్టి.. మొత్తం 150మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
![Tourists rescued in Himachal Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14020331_snow.jpg)
![Tourists rescued in Himachal Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14020331_tour.jpg)
ఆదివారం.. పరాషార్ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురిసింది. వాతావరణం సహకరించకపోయినా.. పర్యటకులు అక్కడికి వెళ్లారు. సాయంత్రం నాటికి వాతావరణం మరింత ప్రతికూలంగా మారింది. రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో 40 వాహనాల్లో వెళ్లిన 150మంది పర్యటకులు అక్కడ చిక్కుకుపోయారు. వారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు.
![Tourists rescued in Himachal Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14020331_snwwo.jpg)
![Tourists rescued in Himachal Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14020331_tourist.jpg)
12గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినట్టు, స్థానికుల సహాయంతోనే పర్యటకులను రక్షించగలిగినట్టు మండీ ఎస్పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. శీతాకాలంలో అలాంటి ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి:- బద్రినాథ్ ఆలయాన్ని కప్పేసిన మంచు దుప్పటి