2022 డిసెంబర్ నాటికి 1,50,000 ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు(హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా గ్రామీణ భారతంలో కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సౌకర్యాలకు సంబంధించి విస్తృత వనరులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 2020 మార్చి 31 నాటికి 1,55,404 ఆరోగ్య ఉప ఆరోగ్య కేంద్రాలు (ఎస్‌హెచ్‌సీ)లు, 24,918 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 5,895 పట్టణ ప్రాంత పీహెచ్‌సీలు ఉన్నాయి.
"వివిధ వ్యాధుల నివారణ, సమగ్ర ఆరోగ్య సంరక్షణను వెల్నెస్ కేంద్రాలు నిర్వహిస్తాయి. క్షేత్రస్థాయిలో సార్వత్రిక, ఉచిత వైద్యం అందుబాటులో ఉంటూనే.. ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు వీలవుతుంది,"
-కేంద్ర ఆరోగ్య శాఖ
ఇప్పటికే అత్యవసర డయాగ్నస్టిక్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. హెచ్‌ఎస్‌సీ స్థాయిలో 14, పీహెచ్‌సీ స్థాయిలో 63 కేంద్రాల్లో ఉచిత డయాగ్నస్టిక్ పరీక్షలతో పాుట.. అవసరమైన మందులను సైతం ఉచితంగా అందింస్తున్నట్లు తెలిపింది. 'ఈ-సంజీవని' వేదిక ద్వారా ఆరు మిలియన్లకు పైగా టెలీ సంప్రదింపులు జరిగినట్లు పేర్కొంది.
ఇవీ చదవండి: 'ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులలో చేర్చాలి'