ETV Bharat / bharat

నేడే భారత్- చైనా 13వ విడత సైనిక చర్చలు - India China standoff

భారత్- చైనా మధ్య 13వ విడత సైనిక చర్చలు (India China border) నేడు జరగనున్నాయి. హాట్​స్ప్రింగ్​ వద్ద ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలపై (India China standoff) ఇరుదేశాల సైనికాధికారులు చర్చించనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

india china border conflict
సైనిక చర్చలు
author img

By

Published : Oct 9, 2021, 3:57 PM IST

Updated : Oct 10, 2021, 5:03 AM IST

తూర్పు లద్దాఖ్​లో ఏర్పడిన సరిహద్దు ప్రతిష్ఠంభనకు (India China standoff) పరిష్కారం దిశగా నేడు భారత్-చైనా మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఆదివారం ఇరుదేశాల సైనికాధికారుల(India China border) మధ్య 13వ విడత చర్చలు జరుగుతాయని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న మోల్డో సెక్టార్ వద్ద సమావేశం జరగనుందని వెల్లడించాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశం (India China latest news) ప్రారంభమవుతుందని స్పష్టం చేశాయి.

హాట్​స్ప్రింగ్ వద్ద ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలపై ఈ భేటీలు సైనికాధికారులు చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ తరపున చర్చల బృందానికి లేహ్​లోని 14 కార్ప్స్​ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించనున్నారు.

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్​చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని అనుకుంటోంది. ఇటీవల చైనా సైన్యం చొరబాటు ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజా సైనిక చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇటీవల ఉద్రిక్త చర్యలు

అరుణాచల్ ప్రదేశ్​ తవాంగ్ సెక్టార్​లోని యాంగ్​ట్సే ప్రాంతంలో భారత్, చైనా బృందాలు గతవారం ఎదురెదురు తలపడ్డాయి. అయితే, స్థానిక కమాండర్ల మధ్య జరిగిన చర్చలతో కొద్ది గంటల్లోనే ఈ వివాదం పరిష్కారమైంది. అంతకుముందు, ఆగస్టు 30న వంద మందికి పైగా చైనా సైనికులు ఉత్తరాఖండ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బారాహోటి సెక్టార్​ గుండా భారత్​లోకి ప్రవేశించారు. కొద్ది గంటల తర్వాత వెనుదిరిగారు.

ఇదీ చదవండి: 'సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు- మేమూ వెనక్కి తగ్గం'

Last Updated : Oct 10, 2021, 5:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.