మధ్యప్రదేశ్‌లో మరో పాశవిక ఘటన వెలుగుచూసింది. మైనర్‌ను అత్యాచారం చేసి బతికుండగానే సమాధి చేసేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని సారని జిల్లా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది...
పొలం దగ్గర మోటార్ స్విచ్‌ను ఆఫ్ చేసేందుకు వెళ్లింది ఓ బాలిక. ఈ తరుణంలో తనను ఒంటిరిగా చూసిన ఆ భూమి యజమాని... బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను బతికుండగానే సమాధి చేసేందుకు యత్నించాడు.
బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పొలం దగ్గర ఆమె స్పృహతప్పి పడిపోయి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు జిల్లా ఆసుపత్రికి చేరిన ఘోరదోంగ్రీ పోలీసు అధికారులు బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం