తమిళనాడులోని తిరునేల్వేలిలో ఓ వాహనం నుంచి ఎన్నికల అధికారులు రూ.12 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధురై విమానాశ్రయం నుంచి కన్యాకుమారి తరలిస్తుండగా అధికారులు జరిపిన తనిఖీలో ఇది పట్టుబడింది. బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేనందున అధికారులు సీజ్ చేశారు . కన్యాకుమారికి చెందిన ఓ వ్యాపారి వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో నగలను కొనుగోలు చేసి ఇతర వ్యాపారులకు విక్రయిస్తాడని సమాచారం.
కోటి రూపాయలు స్వాధీనం..
తిరుచ్చి జిల్లా మనప్పారై నియోజవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి చంద్రశేఖర్ సిబ్బంది ఇళ్లపై ఆదాయపన్ను శాఖ సోమవారం దాడులు జరిపింది. చంద్రశేఖర్ డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు ఆయన దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్న అళగర్సామి, తంగపాండియన్, ఆనంద్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో అళగర్సామి ఇంట్లో ఈ భారీ మొత్తం పట్టుబడింది. ఆ ప్రాంతంలోని ఇతర రాజకీయ ప్రముఖుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ సోదాలు చేసింది.
ఇదీ చదవండి : 'ఒక వ్యక్తి ఒకేసారి ఓటు వేసేలా చూడండి'