అసోంలో ఓ కరడుగట్టిన మిలిటెంట్ ఇంగ్తి కథార్ సాంగ్బిజిత్ సహా ఐదు సంస్థలకు చెందిన 1,039 మంది లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లాంగ్రీ (పీడీసీకే), కార్బీ లాంగ్రీ ఎన్‌సీ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎన్ఎల్ఎఫ్), కార్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్ (కేపీఎల్‌టీ), కుకి లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్‌ఎఫ్), యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (యూపీఎల్‌ఏ) సంస్థలకు చెందిన ముష్కరులు జనజీవన స్రవంతిలోకి చేరేందుకు సీఎం ముందు సర్బానంద సోనోవాల్ ముందు ఆయుధాలతో పాటు లొంగిపోయారని పేర్కొన్నారు.
పీడీసీకే సంస్థ నాయకుడైన సాంగ్బిజిత్.. గతంలో నిషేధిత సంస్థ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ కమాండర్ ఇన్ చీఫ్గా పని చేశాడు. గత బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాల్లో మైనారిటీ వర్గాల ప్రజల ఊచకోత సహా పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నాడు.
లొంగిపోయిన వారికి ఆర్థిక సాయం చేస్తామన్న సీఎం.. తమ ప్రభుత్వం అసోంను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా తయారు చేస్తుందన్నారు.
ఇదీ చూడండి: తిహార్ జైలు నుంచి దిశ రవి విడుదల