ETV Bharat / bharat

బస్సు సీటు కింద 100 కిలోల వెండి.. నడుము బెల్ట్​లో 16 కేజీల బంగారం

రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సుపై అనుమనం వచ్చి.. రాజస్థాన్​ చెక్​పోస్ట్​ అధికారులు సోదాలు జరపగా.. ఓ సీటు కింద భారీగా వెండి పట్టుబడింది. దాని విలువ దాదాపు రూ.86 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ముంబయి ఎయిర్​పోర్ట్​లో రూ.8.40 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు సీజ్​ చేశారు.

silver gold seize
silver gold seize
author img

By

Published : Oct 14, 2022, 8:45 AM IST

Updated : Oct 14, 2022, 9:04 AM IST

రాజస్థాన్​లోని సిరోహి జిల్లా పోలీసులు.. ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వెండిని అహ్మదాబాద్​ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం.

పోలీసుల సమాచారం ప్రకారం..
జిల్లాలోని అబురోడ్​ పోలీసులు.. మావల్​ చెక్​పోస్ట్​ వద్ద రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సాధారణ చెకింగ్​లో భాగంగా.. ఓ ప్రైవేట్​ బస్సును పోలీసులు ఆపారు. డ్రైవర్​ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న పోలీసులు.. బస్సు మొత్తం సోదాలు నిర్వహించారు. ఓ సీటు కింద దాచిన పెట్టెలో ఒక క్వింటాల్​ 40 గ్రాముల వెండిని అభరణాల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి విలువ సుమారు రూ.86,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. సమాధానం కూడా చెప్పలేకపోయాడని అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

1-quintal-40-gram-silver-caught-from-private-bus-in-sirohi
స్వాధీనం చేసుకున్న వెండి

నడుము బెల్ట్​లో 16 కిలోల బంగారం..
మహారాష్ట్రలోని ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.8.40 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్​ అబాబా నుంచి వచ్చి అతడు.. నడుముకు పెట్టుకున్న బెల్ట్​లో 16 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్కా సమాచారం ప్రకారం.. ఇథియోపియన్​ ఎయిర్​లైన్స్​ విమానంలో వచ్చిన అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు జరిపామని చెప్పారు.

Last Updated : Oct 14, 2022, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.