ETV Bharat / bharat

అసోంలో 1.08 లక్షల అనుమానిత ఓటర్లు - సునిల్ అరోడా

అసోంలో 1.08 లక్షల అనుమానిత ఓటర్లు ఉన్నట్లు గుర్తించింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. వీరికి ఓటు వేసే అనుమతి లేదని ఎన్నికల ప్రధానాధికారి నితిన్ ఖాడే స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య సహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు.

1.08 lakh 'D' voters will not be allowed to vote in Assam polls
'1.08 లక్షల డౌట్​ఫుల్​ ఓటర్లకు అనుమతిలేదు'
author img

By

Published : Feb 28, 2021, 10:30 AM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుమానాస్పద ఓటర్లపై దృష్టి సారించింది అసోం ఎన్నికల సంఘం. రాష్ట్రంలో లక్షా ఎనిమిది వేల అనుమానిత ఓటర్లు ఉన్నట్లు లెక్కగట్టింది. వీరందరికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అనుమతి లేదని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నితిన్ ఖాడే తెలిపారు. గతేడాది అనుమానిత ఓటర్ల సంఖ్య 1.13 లక్షలుగా ఉండేదని పేర్కొన్నారు.

అరోడా స్పష్టత

జనవరిలో అసోంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా అనుమానిత ఓటర్లపై స్పష్టత ఇచ్చారు. జాతీయ పౌర పట్టికలో పేరు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్న వారు ఓటు వేసేందుకు అర్హులే అని తెలిపారు. ఫారెనర్స్ ట్రైబ్యునల్​ ప్రకారం విదేశీయులుగా గుర్తించిన వారికి ఓటు వేసే అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీరినే అనుమానాస్పద ఓటర్లుగా పరిగణిస్తారని అన్నారు.

భద్రత కోసం..

ఎన్నికల నేపథ్యంలో 40 కేంద్ర భద్రతా బలగాల బృందాలు రాష్ట్రానికి చేరుకున్నట్లు ఖాడే తెలిపారు. కొవిడ్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఓటర్ల వివరాలు...

మొత్తం ఓటర్లు: 2,32,44,454

పురుషులు: 1,17,42,661

మహిళలు: 1,14,43,259

ఇతరులు: 442

సర్వీస్ ఓటర్లు: 62,134

విదేశీ ఓటర్లు: 11

మొత్తం పోలింగ్​ కేంద్రాలు: 33,530

ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు: 5,325

మొత్తం ఓటర్లలో 1,23,081 మంది వికలాంగులు, 1,20,677 మంది 80 ఏళ్లకు పైబడినవారు ఉన్నారని ఎన్నికల ప్రధానాధికారి ఖాడే తెలిపారు.

అసోంలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 27న తొలిదశ, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6 న మిగతా దశ పోలింగ్స్​ జరగనున్నాయి.

ఇదీ చదవండి:దత్తత తీసుకున్న యువకుడి పెళ్లికి రాజ్​నాథ్​ హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.