'రాష్ట్రంలో.. అంబరాన్నంటిన భోగి సంబరాలు' - రాష్ట్రంలో అంబరాన్నంటిన భోగి సంబరాలు
🎬 Watch Now: Feature Video
రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడ అంతా భోగి సంబరాల్లో మునిగితేలారు. వేకువ జామునే భోగి మంటలు వేసి ప్రజలు సంక్రాంతికి స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా ముందుగా గోపూజలు నిర్వహించారు. అనంతరం భోగి మంటలు వేసి లలితా, విష్ణు సహస్ర నామాలను పఠించారు. భోగి మంటల చుట్టూ కోలాటం, నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు ఆకాంక్షించారు.