ప్రతిధ్వని: ఆన్లైన్ విద్యకు సంబంధించి ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి ? - ఈరోజు ప్రతిధ్వని వార్తలు
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా ఆన్లైన్ బోధనలో గణనీయమైన మార్పులు వచ్చాయని అసర్ నివేదిక వెల్లడించింది. 2018తో పోల్చితే స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగినప్పటికీ...మరో వైపు డిజటల్ ఆగాథం పెరిగిపోతుంది. దేశంలోని 25 కోట్ల మంది విద్యార్థుల్లో అత్యధికులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవని స్పష్టం చేసింది. తెలుగురాష్ట్రాల్లోనూ డిజిటల్ తరగతులు అందుతోంది కొందరికే. అయితే కరోనా నేపథ్యంలో అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కదిద్దాలని అసర్ ప్రభుత్వాలకు సూచించింది. బోధనా సిబ్బందికి ఆన్లైన్ విద్యలో శిక్షణ అవసరాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అసర్ నివేదికలోని ముఖ్యాంశాలు, ఆన్లైన్ విద్యకు సంబంధించి ప్రభుత్వాల ముందున్నటువంటి సవాళ్లను విశ్లేషించుకోవటానికి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.