వైరల్ వీడియో : జింక పిల్లను మింగేసిన కొండ చిలువ
🎬 Watch Now: Feature Video
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరపేట కనుమదారిలో చుక్కల జింకను కొండచిలువ మింగేసింది. శేషాచల అడవుల్లో సుమారు పది అడుగులు ఉన్న కొండచిలువ.... చిన్న జింక పిల్లను అమాంతం నోటకరిచి మింగింది. తర్వాత కదల్లేక అక్కడే ఉండిపోయింది. అటుగా వెళుతున్న కొందరు యువకులు దీనిని గమనించి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.