బండి ఆగింది.. బతుకు బరువైంది - ఏపీలో లాక్‌డౌన్ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఆధ్యాత్మిక క్షేత్రం కేంద్రంగా ఇన్నాళ్లు పరుగులు తీసిన ఆ చక్రాలన్నీ ఆగిపోయాయి. తిరుమల సహా పరిసర పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లే... వాహన చోదకులు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రాలన్నింటికీ యాత్రికుల రవాణానే జీవనాధారంగా గడిపిన ప్రైవేటు వాహనదారులు ఇప్పుడు బతుకు తెరువు కోల్పోయారు. లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం సహా అన్ని దేవాలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేసిన ారణంగా...పూట గడవక విలవిలాడుతున్నారు.