ప్రతిధ్వని: ఈసారి కేంద్ర బడ్జెట్​ ఎలా ఉండబోతోందో తెలుసా ? - ప్రతిధ్వని ఈరోజు డిబేట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 13, 2021, 10:26 PM IST

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్​పైనే ప్రస్తుతం అందరీ దృష్టి నెలకొని ఉంది. కొవిడ్​ సంక్షోభానికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్​ ఉంటుందని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇంతకు ముందెన్నడూ లేనిదిగా ఈ బడ్జెట్​ తయారు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బడ్జెట్​లో కొత్త పన్నులు విధించవద్దని ఆర్థిక వేత్తలు కేంద్రానికి సలహా ఇచ్చారు. కొవిడ్​ వ్యాక్సిన్​ సెస్​ విధించవచ్చు.. కానీ అది ఏడాది కాలానికి మాత్రమే వర్తించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం తర్వాత వస్తున్న కేంద్ర బడ్జెట్​ ఏ విధంగా ఉండబోతోంది? అన్ని వర్గాలు యేయే అంశాలను కోరుకుంటున్నాయి అనే అంశాలకు సంబంధించిన ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.