ప్రతిధ్వని: రష్యా టీకాపై నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలు ఏమిటి..? - ప్రతిధ్వని ఈనాటి చర్చ అంశం
🎬 Watch Now: Feature Video
ప్రపంచమంతా ఎంతో ఆశగా ఎదురుచుస్తున్న కరోనా టీకా వచ్చేసింది. కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటించిన టీకా దిగుమతిపై ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే తుది విడత పరీక్షలు పూర్తి కాకముందే ప్రకటించిన రష్యా టీకా భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో వణుకుతోన్న ప్రపంచానికి రష్యా టీకా ఎలాంటి భరోసాని ఇస్తుంది..? రష్యా టీకాపై నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలు ఏమిటి..? కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలలో ఎలాంటి ఆశలు చిగురిస్తున్నాయి..? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.