ప్రతిధ్వని: ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల విచారణ.. అమికస్క్యూరీ సూచనలు - ప్రతిధ్వని వీడియోలు
🎬 Watch Now: Feature Video
ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల విచారణకు అనుసరించాల్సిన కార్యాచరణను సూచిస్తూ అమికస్క్యూరీ విజయ్ హన్సారియా.. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. వివిధ హైకోర్టుల అభిప్రాయాలను క్రోడీకరించి.. నివేదిక రూపొందించారు. కార్యాచరణ ప్రణాళికను అమలుచేసేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని హైకోర్టులను ఆదేశించాలి. అన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు.. కేసుల వివరాలు, పురోగతిని వెల్లడించేలా ప్రత్యేక వెబ్సైట్ఏర్పాటుచేయాలి. సాక్షుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ గదులను కేటాయించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కార్యాచరణ ప్రణాళికపై ప్రతిధ్వని చర్చ.