ప్రతిధ్వని: కొవిడ్ చికిత్సకై ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి - మధ్యతరగతికి కొవిడ్ చికిత్స భారం వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ధనవంతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రైవేట్ వైద్యాన్ని చేయించుకుంటున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు మాత్రం అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరలేక, ఇటు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక అల్లాడుతున్నారు. అత్యధిక కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ఎక్కడా అమలు చేయడం లేదు. కొవిడ్ చికిత్సకు లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తుండటంతో ఇళ్లో, పొలమో, స్థలమో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొవిడ్ చికిత్స కోసం సామాన్యులు పడుతున్న ఆర్థిక కష్టాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.