భారత్‌లో కరోనా కల్లోలంపై ప్రవాసాంధ్రుల పాట
🎬 Watch Now: Feature Video
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని రంగాలను, అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గముఖం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ బారినపడిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వర్తమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రవాసాంధ్రుడు అట్లూరి అశ్విన్ ఓ పాటను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ పాటను సినీగీత రచయిత చైతన్యప్రసాద్ రాశారు. ఖుద్దాస్ సంగీతం అందించారు. సినీగాయని మాళవిక గొంతు నుంచి పలికిన ఈ పాటకు దొండపాటి రాజేష్‌చౌదరి ఎడిటర్‌గా వ్యవహరించారు. భరత దేశపు చిత్రపటమే.. చితుల పటమౌతున్నదే.. శివుని గంగే శవము గంగై.. సిగ్గుపడిపోతున్నదే.. బితుకు బితుకని.. భయమే.. గుండె గుండెలొ నిండగా.. అంటూ ఈ పాట సాగుతుంది.
Last Updated : Jun 12, 2021, 4:02 PM IST