నల్లమల అందాలు.. కృష్ణమ్మ సోయగాలు - నల్లమల అందాలు.. కృష్ణమ్మ సోయగాలు
🎬 Watch Now: Feature Video
చుట్టూ నల్లమల... నడుమ కృష్ణమ్మ పరుగు... వేలాది మహావృక్షాలతో అలరారే ప్రకృతి సంపదకు ఆలవాలంగా, పెద్ద పులుల వంటి వన్యప్రాణులకు ఆలంబనగా ఉన్న నల్లమల... ఇటీవల కాలంలో చర్చనీయంశంగా మారింది. సేవ్ నల్లమల అంటూ రాజకీయ పార్టీలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన బాటలో నడిచారు. పర్యావరణ హితమే లక్ష్యంగా రాష్ట్రమంతటినీ ఏకతాటిపైకి తెచ్చిన నల్లమలను బోరు తవ్వకాలతో జల్లెడ చేస్తామంటే ఎంత స్పందన వచ్చిందో... ఈ అడవుల అందాలను ఒక్కసారి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇంత చక్కనైన నల్లమల అడవుల రమణీయతను ప్రజల ముందుంచేందుకు ఈటీవీ భారత్ చేస్తున్న ప్రయత్నమిది.