రాశిఫలం: తుల - Libra horoscope 2020-2021
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6530833-256-6530833-1585058264149.jpg)
ఆదాయం:14, వ్యయం: 11, రాజ్యపూజ్యం: 7, అవమానం: 7
శ్రీ శార్వరినామ సంవత్సరంలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి సాధిస్తారు. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న మీ వాళ్లు అభివృద్ధి చెందడం... వారి వల్ల మీకు పేరు, ప్రతిష్ఠలు కలుగుతాయి. సొంతం అనుకున్న వాళ్లే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్టేషనరీ, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ సామగ్రి, రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఏకపక్ష నిర్ణయాల ద్వారా ఏదైనా చేసినప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. నిత్యం శివారాదన శుభం చేకూర్చుతుంది.