పంద్రాగష్టుకు ముస్తాబైన విజయవాడ - krishna
🎬 Watch Now: Feature Video
పంద్రాగస్టును పురస్కరించుకుని విజయవాడ నగరంలోని ప్రధాన మార్గాలు విద్యుత్తు దీపాల వెలుగులతో ధగధగలాడాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. రైల్వేస్టేషన్, రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం, రాజ్‌భవన్, కలెక్టరు క్యాంపు కార్యాలయం, ప్రైవేటు వాణిజ్య సముదాయాలతో సహా వివిధ భవనాలను మువ్వెన్నెల పతాక రంగులతో మిరమిట్లు గొలిపేలా విద్యుత్తు దీపాలతో ప్రాంగణాలను తీర్చిదిద్దారు. సచివాలయం, శాసనసభ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆవరణలోని పార్కు, ఇతర చెట్లకు విద్ద్యుల్లతలు అమర్చారు.