ఆశ పెడుతోంది వరి.. పంట కోసేందుకు ఏదీ దారి..! - తూర్పుగోదావరిలో యంత్రాలు లేక వరికోత కోయని రైతులు
🎬 Watch Now: Feature Video
తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది వరి దిగుబడి ఆశాజనకంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. పొలంలో ఏపుగా పెరిగిన వరి కంకుల్ని చూసి అన్నదాత సంతోషంతో మురిసిపోతున్నాడు. అయితే లాక్డౌన్ రైతుల పాలిట శాపంగా మారింది. కోసేందుకు కూలీలు రాక.. అందుబాటులో కోత యంత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో మండలం పరిధిలో 10 నుంచి 15 వరకు వరి కోత యంత్రాలు అవసరం కాగా.. ప్రస్తుతం ఒకటి, రెండు యంత్రాలు మాత్రమే ఉన్నాయి. కోతలు ఆలస్యమైతే తాము నష్టపోతామని.. సర్కారు స్పందించి తగినన్ని యంత్రాలను సమకూర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.