రాశిఫలం: మకరం - Capricorn horoscope in 2021-2022
🎬 Watch Now: Feature Video
ఆదాయం:11, వ్యయం: 05, రాజ్యపూజ్యం: 02, అవమానం: 06
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిచాలి. వృత్తి, వ్యాపారాల మీద వ్యక్తిగత విషయాల ప్రభావం పడకుండా జాగ్రత్ర వహించండి. శత్రువులు మిత్రులుగా మారతారు. దైవానుగ్రహం వల్ల ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. రవాణా సంబంధమైన ప్రింటింగ్, డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగండి. ప్రతిరోజూ శివుని ఆరాదిస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి.