కదం తొక్కిన రాజధాని రైతులు.. 9 కిలోమీటర్లు మహా ర్యాలీ - అమరావతి ఉద్యమం 300వ రోజు న్యూస్
🎬 Watch Now: Feature Video

రాజధాని రైతులు కదం తొక్కారు. 300వ రోజుకు అమరావతి ఉద్యమం చేరుకోనున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది రైతులు, మహిళలు 9 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు నుంచి ప్రారంభమైన ప్రదర్శన రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం చేరుకుంది. 29 గ్రామాల రైతులు ఇందులో పాల్గొన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.