ప్రతిధ్వని: ఆరోగ్య డిజిటల్ కార్డులతో వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులొస్తాయా?
🎬 Watch Now: Feature Video
భారతీయ వైద్యరంగం భవిష్యత్లో డిజిటల్ విప్లవానికి నాంది పలకబోతోంది. ఇందులో భాగంగా జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య గుర్తింపు సంఖ్యను జారీ చేయనుంది. ఈ కార్డుల్లో పౌరుల ఆరోగ్య, వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు లావాదేవీలు, కుల మత వివరాలను డిజిటల్ రూపంలో పొందుపర్చనున్నారు. మున్ముందు టెలీ మెడిసిన్, ఈ ఫార్మసీ సదుపాయాలు కూడా ఎన్డీహెచ్ఏ పరిధిలోకి వస్తాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. జాతీయ గుర్తింపు సంఖ్య సమాచార నిర్వహణలో వ్యక్తిగత గోప్యతను పాటించనున్నారు. అయితే ఇందులో చేరాలా లేదా అనేది ప్రజల అభీష్టానికే వదిలేయనున్నారు. మొత్తంగా ఆరోగ్య డిజిటిల్ కార్డులతో భారతీయ వైద్య రంగంలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయనే అంశంపై ప్రతిధ్వని చర్చ.