విజయవాడ బాపు ప్రదర్శనశాల పునఃప్రారంభం - రేపటి నుంచి బాపు ప్రదర్శన శాల ప్రారంభం
🎬 Watch Now: Feature Video
విజయవాడలో పదేళ‌్ల క్రితం మూతపడిన బాపు ప్రదర్శనశాల మళ్లీ సందర్శకులకు కనువిందు చేయబోతోంది. 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి... సుమారు 8 కోట్లతో ఈ ప్రదర్శన శాలను ఆధునికీకరించారు. పాత భవనం స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టారు. 7 గ్యాలరీల్లో వందలాది కళాఖండాలను ప్రదర్శనగా ఉంచారు. జైన,బుద్ధ, హిందూ విగ్రహాలు, తొలి చారిత్రిక యుగం నాటి వస్తువులు, నాణేలు, శాసనాలు, వస్త్రాలు, మధ్యయుగపు కళా దృక్పథాలు, ఆయుధాలు ఇక్కడ పదిలపరిచారు. మనిషి నమ్మకాలకు ప్రతిరూపాలైన ప్రాచీన కళాఖండాల విశిష్టతను అందరికీ తెలియజేయడమే ఉద్దేశ్యంగా ఈ మ్యూజియం తీర్చిదిద్దినట్లు పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ బాపు మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు.
Last Updated : Oct 1, 2020, 12:32 AM IST