రాశి ఫలం: కుంభం - 2020-2021 రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
ఆదాయం:11, వ్యయం: 05, రాజ్యపూజ్యం: 05, అవమానం: 06
కుంభ రాశివారికి ఈ ఏడాది మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మాటతీరుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన దానికంటే ముందుగానే వస్తాయి. రుణాల విషయంలో మీపై అపనిందలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదం నెలకొనే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించాలి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు లాభిస్తాయి. గృహ సంబంధమైన విషయాలకు ఎక్కువ వెచ్చిస్తారు. అపురూపమైన ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. మాటతప్పే మనుషుల వల్ల ఇబ్బంది పడతారు. కళా, సాంస్కృతిక, సాహిత్య, సినీ, క్రీడా టీవీ రంగాల్లో నూతన అవకాశాలు అందివస్తాయి. వ్యాపార, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త వహించాలి. సాయినాథుని పూజిస్తే శుభం కలుగుతుంది.