ప్రతిధ్వని: వెండితెరకు కరోనా కట్స్! - భారతదేశంపై కరోనా ప్రభావం
🎬 Watch Now: Feature Video
సినిమా.. ఒక రంగుల కల. అలాంటి సినిమా కలలన్నీ కరోనా దెబ్బతో చెల్లాచెదురు అయ్యాయి. మాటలు, పాటలు, ఆటలతో మనసును ఓలలాడించే మూడు గంటల వినోద ప్రపంచం ఇప్పుడు మోడు వారింది. ప్రేక్షకులను నవ్వించి, కవ్వించే సినిమా తెర వెలవెలబోతోంది. కరోనా రెండో వేవ్ తాకిడికి... సినీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. భారీ బడ్జెట్లతో వేలాది మందికి ఉపాధి కల్పించిన తెలుగు సినిమా షూటింగ్‌లు.. అర్ధంతరంగా నిలిచిపోయాయి. వందల కోట్లతో కొనసాగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. షూటింగ్ ముగించుకున్నసినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. అంతే... ప్రవహించే ఉత్తేజం లాంటి సినిమా... ఇప్పుడు గడ్డగట్టిన మంచులా స్తంభించిపోయింది. చేతుల్లో పనిలేక సినీ కార్మికులు.. కొత్త అవకాశాలు రాక నటీనటులు, పెట్టుబడులు, రుణాల భారం పెరుగుతూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. కరోనా కబంధ హస్తాల్లో చిక్కిన సినీ పరిశ్రమ కష్టాలపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : May 1, 2021, 9:02 PM IST