YV Subbareddy Key Comments on CM Jagan Shifting: విజయదశమి నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ: వైవీ సుబ్బారెడ్డి
🎬 Watch Now: Feature Video
YV Subbareddy Key Comments on CM Jagan Shifting: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన కొనసాగించే అంశంపై వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయదశమి నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, శ్రీకాకుళంలో మాలపేట పోర్ట్, ఇనార్భిట్ మాల్.. ఇలా ఎన్నిటికో శంకుస్థాపన చేశామన్నారు. టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసినవి శిలాఫలకంగానే మిగిలిపోయాయని సుబ్బారెడ్డి విమర్శించారు. శంకుస్థాపన చేసిన వారం రోజుల లోపల వైసీపీ హయాంలో పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
వారాహి యాత్ర పవన్ ఎందుకు చేస్తున్నారు..?.. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్ర అభివృద్ధిని చూసే పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారు. అందుకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిటే నిదర్శనం. వైసీపీ హయాంలో ఎన్నో ప్రారంభోత్సవాలు చేశాం. మాతో వస్తే వాటిని టీడీపీ నేతలకు చూపిస్తాం. వారాహి యాత్ర పవన్ ఎందుకు చేస్తున్నారో..? అది మాకు సంబంధం లేదు. విశాఖలోనూ, రాష్ట్రంలోనూ వైసీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు. భారీ స్థాయిలో విశాఖలోనూ, రాష్ట్రంలోనూ పెట్టుబడులు వచ్చాయి. ఈ విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. విజయ దశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ఉంటుందని గతంలో సీఎం పలుమార్లు చెప్పారు. ఆ మాట ప్రకారమే విజయ దశమి నుంచి పరిపాలను ఉంటుంది'' అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.