Nara Lokesh Fire On Cm Jagan: జగన్ పాలనలో గంటకో కిడ్నాప్.. పూటకో రేప్.. రోజుకో మర్డర్: నారా లోకేశ్ - Nara Lokesh comments
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Fire On Cm Jagan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' నేటి పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం ప్రభంజనం చూసి సీఎం జగన్‌కు భయం పట్టుకుందని.. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో మర్డర్ జరుగుతోందని నారా లోకేశ్ ఆరోపించారు.
152 రోజులు పూర్తి చేసుకున్న యువగళం.. 'యువగళం' పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభమైన రోజు నుంచి నేటివరకూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడుల గురించి నారా లోకేశ్ ప్రజలకు, యువతకు తెలియజేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 151 రోజులు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర నేటితో 152వ రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్రను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట నుంచి లోకేశ్ ప్రారంభించారు.
కావలి ఎమ్మెల్యే అవినీతిపై సిట్ వేస్తాం.. కావలిలో ఏర్పాటు బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ..''యువగళం ప్రభంజనం చూసి జగన్‌కు భయం పట్టుకుంది. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో మర్డర్ జరుగుతుంది. విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు. కావలి అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. కావలిలో 7 శిలాఫలకాలు వేశారు తప్పా.. ఒక్క పని కూడా ప్రారంభించలేదు. కావలిలో అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనిదే. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సిట్ వేస్తాం'' అని ఆయన అన్నారు.