YSRCP Minister Meruga Nagarajuna Misbehaviour: ఇదేనా ప్రజాస్వామ్యం..! సామాన్యుడిపైనా అధికార దర్పం..? మంత్రి దురుసు ప్రవర్తనపై జనం మండిపాటు - డీఎస్పీపై మంత్రి జోగి రమేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 12:34 PM IST

YSRCP Minister Meruga Nagarajuna Misbehaviour: వైసీపీ మంత్రుల అధికార అహంకారం రోజురోజుకు ముదిరిపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో డీఎస్పీపై మంత్రి జోగి రమేశ్​ చిర్రుబుర్రులాడగా.. ప్రస్తుతం మంత్రి మెరుగ నాగార్జున ఓ సామాన్యుడిపై దురుసుగా వ్యవహరించాడు. సమస్యలపై నిలదీసినందుకు.. సహనం కోల్పోయిన మంత్రి నాగార్జున.. నిలదీసిన వ్యక్తిని పక్కకు నెట్టేశాడు. మంత్రి ఇలా సామాన్యుడిపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 

అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మెరుగ నాగర్జున పాల్గొన్నారు. అయితే తమ గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. మోహన్‌ రావు అనే గ్రామస్థుడు మంత్రి ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్యను పరిష్కరించాలని మంత్రిని వేడుకున్నాడు. అంతా విన్న మంత్రి నాగార్జున.. అతన్ని దురుసుగా పక్కకు నెట్టేసి అతనిపై కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కొందరు మంత్రి అనుచరులు మోహన్​ రావుతో వాగ్వాదానికి దిగారు. సొంత నియోజకవర్గంలోని సమస్యని పరిష్కరించమని కోరితే.. మంత్రి దురుసుగా ప్రవర్తించడం సరికాదని ప్రజలు విమర్శిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.