YSRCP Leaders Attack on SEB Constable : పోలీస్ స్టేషన్‌పై వైసీపీ నేతల దండయాత్ర.. మహిళా కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడి.. - సెబ్ కానిస్టేబుల్
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders Attack on SEB Constable : ఈ రాష్ట్రంలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కొరవడింది. ఎక్కడో మారుమూల ప్రాంతమో, ఎవరూ లేని నిర్మానుష్య స్థలమో కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట.. ఓ మహిళా కానిస్టేబుల్ కీచకుల బారి నుంచి తనను తాను కాపాడుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ ఘటనపై పోలీస్ పెద్దలుగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గానీ స్పందించిన దాఖలాల్లేవు. అనంతపురం సెబ్ స్టేషన్(SEB) ఎదుట కానిస్టేబుల్ రాధమ్మపై వైసీపీ కార్పొరేటర్ సహా ఆ పార్టీ నాయకులు దాడికి సంబంధించి మరికొన్ని దృశ్యాలు బయటికొచ్చాయి. ఎమ్మెల్యే అనుచరులను అరెస్టు చేశారంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తల ముఠా... స్టేషన్‌పైన దండయాత్రకు వెళ్లింది. స్టేషన్ గుమ్మం దగ్గరే వాళ్లను అడ్డుకున్న కానిస్టేబుల్(Constable) రాధమ్మ పట్ల వైసీపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై ఇష్టం వచ్చినట్లు తాకుతూ కిరాతకంగా వ్యవహరించారు. మరో కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మిగిలిన పోలీసులంతా గట్టిగా ప్రతిఘటించి వైసీపీ నాయకుల దాడి నుంచి సహచర కానిస్టేబుల్‌ను రక్షించుకున్నారు.. దాడి చేసిన వారిని లాక్కెళ్లి స్టేషన్‌లో పడేశారు.