పీక్స్‌కు చేరిన అధికార నేతల పిచ్చి - గ్రామ సచివాలయంపై వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఫొటో - తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ ఫోటో
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 1:10 PM IST
YSRCP Leader Photo on Ravela Village Secretariat: వైసీపీ నేతల ప్రచార యావ రోజురోజుకీ శ్రుతి మించుతోంది. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులతో మొదలైన తంతు ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామ సచివాలయంలో వైసీపీ నేత కత్తెర సురేశ్ కుమార్ తన ఫొటోను ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఉండటం పరిపాటి. కానీ, అవేమీ తమకు పట్టవన్నట్లు వైసీపీ నేతలు ఏకంగా సచివాలయ భవనాలపైనా ఇలా సీఎం జగన్ ఫొటోతో పాటు తమ ఫోటోలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఏకంగా వైసీపీ నేత తన ఫొటోని సచివాలయంలో ఏర్పాటు చేయడంపై స్థానికంగా దుమారం చెలరేగుతోంది. కొద్దిరోజుల క్రితం వరకూ కత్తెర సురేశ్ తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా వ్యవహరించారు. సురేష్ భార్య కత్తెర క్రిష్టినా గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్‌గా అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ నేత అయితే మాత్రం ఇలా వ్యవహరిస్తారా అంటూ ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు.