ఎంపీని దూషించాడంటూ వైసీపీ నేతను అరెస్ట్ చేసిన పోలీసులు - ఆవేదనలో కుటుంబ సభ్యులు - YCP leader Ravikant News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 10:07 PM IST
YSRCP Leader in Police Station For Two Days: విచారణ పేరుతో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేసి, రెండు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో ఉంచిన సంఘటన సంచలనంగా మారింది. ఓ ఎంపీని ఫోన్‌లో దూషించారన్న కారణంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఎంపీ వద్దకు వెళ్లి వేడుకున్నా.. వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
YCP Councilor Ravikant Arrest: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవికాంత్.. ఓ ఎంపీని ఫోన్‌లో దూషించాడని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ పేరుతో రెండు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎంపీ వద్దకు వెళ్లి వేడుకున్నారు. అయినా, రవికాంత్‌ను వదిలిపెట్టడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. రవికాంత్‌కు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.