ఉపకరణాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం - అవస్థలు పడ్డ దివ్యాంగులు - ysr district latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 5:42 PM IST

YSRCP Government Negligence Towards Disabled Persons: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగుల (Handicapped)కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్రై సైకిళ్లు (Tri Cycles), వీల్ చైర్లు పంపిణీ (Wheel Chair Distribution)లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఉపకరణాల్లో(Tools) ఉన్న లోపాలను పట్టించుకోకుండా పంపిణీకే అధికారుల ప్రాధాన్యత ఇవ్వడంతో దివ్యాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తాడు(Ropes), పలు వాహనాల(Other Vehicles)లో సైకిళ్లను ఇంటికి చేర్చుకున్నారు.

Tri Cycles Carried with Help of Ropes: కమలాపురం నియోజకవర్గంలో ఈరోజు 1203 మంది దివ్యాంగులకు 17 రకాల 1823 ఉపకరణాలను వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్(MLA Ravindranadh) చేతుల మీదుగా పంపిణీ చేశారు. వీటిలో కొన్ని ట్రై సైకిల్స్(Tri Cycles)​లో గాలి లేవు. మరికొన్ని సైకిళ్ల బ్యాటరీలో చార్జింగ్ లేకపోవటంతో దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. లబ్ధిదారులు వీటిని ఇంటికి తీసుకోవెళ్లడానికి అనేక అవస్థలు పడ్డారు. ఈ సైకిలను ట్రాక్టర్లలో, ఆటోల్లో, తాడు సాయంతో ఇంటికి తీసుకువెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.