విశాఖలో వైఎస్సార్సీపీని ఖాళీ చేయడమే మా ప్రధాన ధ్యేయం : అసమ్మతి కార్పొరేటర్లు - ap politics
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-01-2024/640-480-20536500-thumbnail-16x9-ysrcp-dissident-corporators-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 1:00 PM IST
YSRCP Dissident Corporators Meeting : వైఎస్సార్సీపీ కోసం శక్తి వంచన లేకుండా పని చేశానని, తన కష్టానికి పార్టీలో తగిన ప్రతిఫలం లభించలేదని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ అసమ్మతి కార్పొరేటర్లతో హాజరయ్యారు. తన వల్ల పార్టీలో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. తాను వైఎస్సార్సీపీలో చీలికలు తేలేదని, పార్టీపై ఉన్న అసంతృప్తి వలన కార్పొరేటర్లు, నాయకులు తనతో నడుస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని, ఏ పార్టీలో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో నిర్ణయం తీసుకొని వెల్లడిస్తానని సీతంరాజు సుధాకర్ తెలిపారు. విశాఖలో సగం మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పార్టీని వీడనున్నారని, పార్టీని ఖాళీ చేయడమే తన ప్రధాన ద్యేయమని పేర్కొన్నారు.
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మద్యాన్ని పంపిణీ చేశారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సుధాకర్ ఆరోపించారు. 400 ఫుల్ బాటిల్లు ఎమ్మెల్యే వాసుపల్లికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రామబాణం విద్యాసంస్థలో మద్యం పంపిణీ చేయడం దారుణమని డిఫెన్స్‌లో పనిచేసి వచ్చిన వాసుపల్లి సమాజానికి ఇస్తున్న సందేశం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి మద్యం పంపిణీపై కేసు పెడతామని ఆయన తెలిపారు.