వైఎస్సార్సీపీ నూతన ఇన్‌చార్జ్‌లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం - ఏపీ రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 2:08 PM IST
YSRCP Activists Protest Against CM Jagan : సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇన్‌చార్జ్‌ల మార్పు పట్ల అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
CM Jagan Changed Repalle Constituency YSRCP Incharge : బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను (Dr. Evuru Ganesh) అధిష్టానం నియమించడంపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు (Mopidevi Venkataramana Rao) అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవూరు గణేష్ నియామకాన్ని నిరసిస్తూ, రేపల్లె పట్టణం, నిజాంపట్నం మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో టైర్లు దహనం చేసి నిరసన తెలిపారు. సమన్వయకర్తగా ఈవూరు గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. తమ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రావును ఇంచార్జ్‌గా ఉంచాలని డిమాండ్ చేశారు. మోపిదేవికి మద్దతుగా ఆ పార్టీ నేతలు నిలిచారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పార్టీకీ రాజీనామా చేసేందుకు వెనకాడబోనని వైఎస్సార్సీపీ స్థానిక నేతలు తేల్చి చెప్పారు.
TAGGED:
AP Politics