YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా
🎬 Watch Now: Feature Video
YS Viveka Murder Case Adjourned to October 6: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను.. సీబీఐ కోర్టు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న ఐదుగురికి రిమాండ్‌ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశిస్తూ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో నిందితునిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డికి చికిత్స కోసం ఈ నెల 10వ తేదీ వరకు సీబీఐ కోర్టు ఎస్కార్టు బెయిల్ పొడిగించింది. ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలోనూ భాస్కర్ రెడ్డి వేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మరోసారి సీబీఐ కోర్టులోనే వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.