YS Jagan: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ - Amul project at Chittoor
🎬 Watch Now: Feature Video
Amul project at Chittoor: అమూల్ ఆధ్వర్యంలో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రూ.325కోట్లతో అమూల్ సంస్థ ముందుకొచ్చిందని జగన్ వెల్లడించారు. చిత్తూరు డెయిరీ దుస్థితిని చూసి నేడుదానికి జీవం పోస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సహకార రంగంలో ఈ డెయిరీ అతిపెద్దదిగా నిలుస్తుందని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరు డెయిరీ సహా సుమారు 54 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయని జగన్ పేర్కొన్నారు. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి అక్కడ కనీసం ఇల్లు కూడా లేదన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నాన్ రెసిడెంట్ నాయకులని సీఎం జగన్ అన్నారు. వాళ్లు మన రాష్ట్రంలో ఉండరని.. దోచుకోవడం కోసమే అధికారం కావాలంటున్నారని విమర్శించారు. ఇన్ని సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు రాజకీయ జీవిత చరమాకంలో ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటానంటున్నారని వ్యాఖ్యానించారు.