Young Man Died of Heart Attack: విషాదం.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి - heart attack treatment
🎬 Watch Now: Feature Video
Young Man Died of Heart Attack : హార్ట్ స్ట్రోక్.. ఇప్పుడు ఈ మాట వింటుంటేనే అందరూ భయపడుతున్నారు. ఇన్నాళ్లూ ఒక వయస్సు దాటిన వారికి.. అధిక బరువు ఉన్నవారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు యువతను సైతం వెంటాడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఆ టెన్షన్ అందరినీ భయపెడుతోంది. తాజాగా స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితుల కలిసి బేతంచెర్ల మండలం సంజీవ్ నగర్ కాలనీకి చెందిన మహేంద్ర(21) గోదాం దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతుండగా గుండె నొప్పి రావడంతో హఠాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన తోటి యువకులు స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మహేంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహేంద్ర మృతితో బంధువులు,స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎలాంటి కారణం లేకుండా గుండెపోటుతో తన కుమారుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందని కన్నీటిపర్యంతమయ్యారు. మృతి చెందిన మహేంద్రను చూసేందుకు వచ్చిన తోటి యువకులు, స్నేహితులు బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.