YCP worker Agitation: బిడ్డలకు జగన్, షర్మిల అనిపేర్లు పెట్టిన నాకే అన్యాయం చేశారు.. ఓ వైసీపీ కార్యకర్త ఆవేదన - victims Concerns at Jagananna Suraksha programme
🎬 Watch Now: Feature Video
YCP worker Concern in Jagananna Suraksha programme: కొడుకు జగన్, కుమార్తెకు షర్మిల అని పేరు పెట్టుకున్న తనకే వైసీపీ ప్రభుత్వం న్యాయం జరగడం లేదని ఆ పార్టీ కార్యకర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులో బిడ్డల పేర్లు ఎక్కించుకునేందుకు మూడేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నానని వాపోయాడు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం మనూరులో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో శ్రీరాములు అనే వైసీపీ కార్యకర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పాలని ప్రయత్నించినా.. పోలీసులు అడ్డుకున్నారన్నారు. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఊరిలో తొలి జెండా కట్టింది తానేనని.. అప్పటి నుంచి పార్టీకి అత్యంత విధేయుడిగా పనిచేస్తున్న తనకే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని శ్రీరాములు వాపోయాడు.
సబ్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న బాధితుడు.. ఇదే కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు చూస్తూ ఉండగానే ఓ బాధితిడు సబ్ కలెక్టర్ కార్తీక్ కాళ్లు పట్టుకున్నాడు. పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్య పెన్షన్ పొందెందుకు అర్హత ఉన్నా.. ఆధార్ కార్డులో వయస్సు తక్కువ ఉండడం వల్ల పెన్షన్ మంజూరు చేయటలేదని కలెక్టర్ వద్ద కన్నీరు పెట్టుకున్నాడు.