పోలీస్స్టేషన్లో వైసీపీ ఎంపీపీ భర్త వినూత్న నిరసన - ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆగ్రహం - Sand mining in Sri Sathyasai district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 10:54 PM IST
|Updated : Dec 4, 2023, 11:00 PM IST
YCP MPP Husband Protest in Rolla Police Station: పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ ఎంపీపీ భర్త పోలీస్ స్టేషన్లో వినూత్నంగా నిరసన చేపట్టాడు. పోలీస్స్టేషన్లోనే చాపపై పడుకొని దుప్పటి కప్పుకొని గంటపాటు నిరసన తెలిపిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రొళ్ల మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లో స్థానిక వైసీపీ ఎంపీపీ కవిత భర్త విజయ రంగేగౌడ్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తపరిచాడు. వారిపై ఆరోపణలు గుప్పిస్తూ స్టేషన్ లోపల హాలులో చాప పరిచి దుప్పటి కప్పుకొని పడుకొని గంటపాటు నిరసన తెలిపారు.
ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం ఇవ్వడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని కనీకం వాటిపై స్పందన లేదని పోలీసులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. స్థానిక వైసీపీ నాయకులు, పోలీసులు విజయ రంగేగౌడ్ని సర్ది చెప్పడంతో చాలా సేపటి తర్వాత నిరసన విరమించారు.