YCP Leaders Protests Against Bhumana as TTD Chairman టీటీడీ చైర్మన్గా భూమనను వ్యతిరేకిస్తూ.. కీలక వైసీపీ నేత రాజీనామా! - YCP leaders Protest on Bhumana as a TTD chairman
🎬 Watch Now: Feature Video
YCP Leaders Protests Against Bhumana as TTD Chairman: తితిదే నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వైసీపీలో ఉన్నత పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారని సొంత పార్టీలోనూ వ్యతిరేకత ఎదురైంది. కర్నూలు జిల్లా అదోనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు రమేష్ యాదవ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. టీటీడీ చైర్మన్ పదవిని రెడ్డిలకు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో యాదవులకు సముచిత స్థానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. యాదవులను గుర్తించే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలిపారు. పార్టీ కోసం పని చేస్తున్న యాదవులకు సరైన గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘం ఆద్వర్యంలో ఆందోళనకు శ్రీకారం చూడతామని అన్నారు.