తవ్వేకొద్దీ తప్పులే - మంత్రి బుగ్గన ఇలాకాలో వైసీపీ నేతలకు రెండు, మూడు ఓట్లు - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 3:45 PM IST
YCP Leaders Double Entries in AP Voter List: ముసాయిదా ఓటరు జాబితాలో తవ్వేకొద్దీ తప్పులే దర్శనమిస్తున్నాయి. చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. అధికార పార్టీ నాయకులకు ఒక్కొక్కరికి రెండు, మూడు ఓట్లు ఉన్నా వాటిని తొలగించలేదు. ఎన్నికల జాబితాలో ఈ అక్రమాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాకాలోనే వెలుగులోకి వచ్చాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 3వేలకు పైగా చనిపోయిన వారు ఉన్నారు. 2వేలకుపైగా డబల్ ఎంట్రీలు ఉన్నాయి.
Irregularities in AP Voter List 2023: డోన్ వైసీపీ ఎంపీపీ రేగటి రాజశేఖరరెడ్డికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఆయన సోదరులు చంద్ర మౌళేశ్వర రెడ్డికి రెండు చోట్ల, రామేశ్వర రెడ్డికి మూడు చోట్ల ఓటు హక్కు ఉండటం గమనార్హం. వైసీపీకి చెందిన డోన్ మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్ భార్య సుమిత్ర పేరు మీద మూడు చోట్ల ఓటు హక్కు ఉంది. ఛైర్మన్ తండ్రి తిమ్మయ్య పేరు మీద రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. కేడీసీసీ ఛైర్మన్ సీమ సుధాకర్ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండగా ఆయన భార్య మనోహరమ్మకి రెండు చోట్ల, కుమారుడు సుబ్బారెడ్డికి మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.