'పంచాయతీల నిధులను సీఎం జగన్ మింగేశారు' - సర్పంచ్‌ల సమర శంఖారావం
🎬 Watch Now: Feature Video
YCP Government Stole Funds Given to Gram Panchayat: గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను తెలుసుకొని గ్రామ వికాస పత్రాన్ని రూపొందించేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో సమర శంఖారావంలో భాగంగా పంచాయతీల్లోని గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలో కిష్టప్పపేట పంచాయతీలో గ్రామ సభను రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని రాజేంద్రప్రసాద్ ముందు ఏకరవు పెట్టారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలతో పంచాయతీలను మేనేజ్ చేస్తున్నారన్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సమర శంఖారావం పేరుతో ఆందోళన చేపడుతున్నాం. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ వికాస పత్రాన్ని రూపొందించడం జరిగింది. సచివాలయాలు, వాలంటీర్లను గ్రామ సర్పంచుల ఆధీనంలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. - రాజేంద్రప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, పంచాయతీ రాజ్ ఛాంబర్