వెలవెలబోయిన వైసీపీ బస్సు యాత్ర - సభ ప్రారంభానికి ముందే వెనుదిరిగిన ప్రజలు - Krishna district News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 9:42 PM IST

YCP Bus Yatra in Krishna District : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వెలవెలబోయింది. సాయంత్రం జరిగే సభకు ఉదయం నుంచే వైసీపీ నేతలు ప్రజలను ఆటోల్లో తరలించారు. మంత్రుల ప్రసంగాల కోసం వేచి చూసి విసిగిపోయిన ప్రజలు.. సభ ప్రారంభం కాక ముందే సభాస్థలి నుంచి వెనుదిరిగారు. మంత్రులు ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు చేశారు. సభ ప్రారంభంలో నల్ల బెలూన్స్‌తో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో నల్లబెలూన్స్‌తో వస్తున్న టీడీపీ నేతల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సామాజిక సాధికారత అనేది ఆచరణలో చేసి చూపిస్తే.. మాటలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయినా అధికార వైసీపీ నాయకులు బస్సు యాత్ర చేపట్టి.. సామాజిక న్యాయం చేసేశామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేసి.. ఉప ప్రణాళిక నిధులన్నింటిని దారి మళ్లించి.. మాటల్లో మాత్రం సామాజిక న్యాయం గురించి చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? అందుకే వైసీపీ చేపట్టే సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. బస్సుయాత్రలు కాస్త తుస్సుమంటున్నాయని పలువురు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.