ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరా కట్టలేరు వాగు - నిలిచిపోయిన రాకపోకలు - ఏపీ వాతావరణ నివేదిక
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 4:37 PM IST
Wyra Kattaleru River Overflowing with Rain Water: మిగ్జాం తుపాను(Michaung Cyclone) ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ తీరప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం దాములూరు వద్ద వైరా-కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు కూడలి వద్ద లో లెవెల్ కాజ్ వే పై వరద ప్రవహిస్తోంది. దీంతో నందిగామ మండలం దాములూరి కూడలి నుంచి వీర్లపాడు మండలం, పల్లంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Michaung Cyclone Effect in NTR District: దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో దశాబ్దం క్రితం హై లెవెల్ కాజ్ వే నిర్మించారు. అయితే దీనికి అనుసంధానంగా రోడ్లు వేయలేదు. దీంతో వైరా-కట్టలేరుకు వరద (Vaira Kattaleru River Floods) వస్తే దీనిపై రాకపోకలు సాగించేందుకు వీలులేకపోవటంతో జనానికి ఇబ్బందులు తప్పట్లేదు.