Vizag port: విశాఖలో పోర్టు కార్మికుల ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ - Workers protest in Vizag Gangavaram port
🎬 Watch Now: Feature Video
Workers protest in Vizag: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టు కార్మికులకు కనీస వేతన ఒప్పందం అమలు చేయాలని పెదగంట్యాడ జంక్షన్ నుంచి పోర్టు గేటు వరకు కార్మికులు ర్యాలీ చేశారు. తొలగించిన కార్మికుల వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు.. తమ మద్దతు తెలిపారు. గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులకు.. బేసిక్పేను 22వేలు చేసి కనీస వేతనం 36వేలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు.. అదానీ పోర్ట్లో గతంలో నిరసన తెలియజేసినందుకు.. విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధులలోకి తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా గంగవరం పోర్ట్లోకార్మిక సంఘాలకు ఒక భవనం నిర్మించాలని.. అదాని పోర్టు ఐడీ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్ట్ కార్మికులకు సంఘీభావంగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.