Women Started Agitation to Solve Drinking Water Problems: తాగునీటి సమస్యపై మహిళల ఆందోళన.. ఏఈ కార్యాలయం ముట్టడి - ఏపీలో మహిళల నిరసన కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 7:30 PM IST
Women Started Agitation to Solve Drinking Water Problems: తమ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ... గుంటూరు నగర శివారు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. స్థానిక నెహ్రూ నగర్ లోని అస్టిసెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని మహిళలు, స్థానికులు ముట్టడించారు. పైపులైన్లు వేసి ఏళ్లు గడుస్తున్నా... నీటి సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుంచి పైప్ లైన్ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్పా చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. కాలనీలో ఉన్న సుమారు వెయ్యి కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. డబ్బులు పెట్టి తాగునీరు బయట కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. అసలే వర్షాకాలం కావడంతో అపరిశుభ్ర నీరు తాగలేక అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా సమస్య పరిష్కరించాలని అధికారాలు, ప్రజాప్రతినిధులను వేడుకున్న పట్టించుకోని పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే.. తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరించారు.